top of page

దేవునితో సరియైనవానిగా ఉండుటకు నేనేమి చేయాలి?

మీరు ఈ ప్రశ్న అడుగుతున్నట్లయితే, మీరు ఇప్పటికే దేవునితో సరిగ్గా ఉండేందుకు మొదటి అడుగు వేశారని అర్థము. యాకోబు 4:8-10 ఇలా చెబుతోంది, “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.” మీరు సరైనదిగా ఉండటానికి దేవుడు అవసరమని అంగీకరించడం సవాలుగా ఉంది. చాలా మంది దీన్ని చేయడానికి ఇష్టపడరు (మత్తయి 7:13). అయితే, దేవుని చిత్తానికి లోబడి తగ్గింపుతో కూడిన విధేయతే ఆయనతో సరిగ్గా ఉండేందుకు ఏకైక మార్గం.


యేసునందు విశ్వాసముంచుట

పరలోకపు సర్వశక్తిమంతుడైన దేవునికి లోబడి తగ్గింపుతో కూడిన విధేయత చూపడం అనేది శరీరధారిగా ఉన్న దేవుడైన యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా ఉండాలి. రోమా 3:21-24 ఇలా చెబుతోంది, “ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.” యేసు మనలను నీతిమంతులుగా, మరియు నీతిగా ఎలా జీవించాలో ఆయన మనకు చూపించాడు. మానవజాతితో సంబంధాన్ని కలిగి ఉండేందుకు దేవుడు ఎంచుకున్న మార్గం ఆయనే. అదే సమయంలో, ఈ భూమిపై యేసు జీవితం అనేది దేవుని నీతికి ప్రతిభింభంలాగా ఉన్నది . కాబట్టి, మనం దేవునితో నీతిగా ఉండాలనుకుంటే, మన విశ్వాసాన్ని యేసు మరియు ఆయన బోధల వైపు మళ్లించాలి.


యేసు నందు విశ్వాసముంచుట అనగా మనము ఆయనయందు నమ్మికయుంచుట మరియు ఆయన నుండి నేర్చుకొనుట. ఒకసారి యేసు కాలములో ఉన్న ప్రవక్తయైన బాప్తిస్మమిచ్చు యోహానుకూడా కొంత అనిశ్చయతను వ్యక్తం చేసాడు. యేసు ఆయనకు తిరిగి ఇలా వర్తమానం పంపాడు, “యేసు వారిని చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది” (మత్తయి 11:4-5). అదే నేపథ్యంలో యేసు ఇలా చెప్పడం కొనసాగించాడు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి” (మత్తయి 11:28-30). మనము దేవునితో నీతిగా ఉండాలంటే, మనం యేసుపై దృష్టి పెట్టాలి. జీవితం కష్టంగా ఉన్నప్పటికీ కూడా, ఓదార్పు మరియు నడిపింపు కొరకు మనం ఆయన వైపు చూడాలి . ఆయన ఈ భూమిపై గొప్ప వైద్యుడు, మరియు ఇప్పుడు కూడా, ఆయన మన ఆత్మలకు గొప్ప వైద్యుడు.


యేసును విశ్వసించాలంటే మృతులలో నుండి ఆయన పునరుద్ధానుడు అయ్యాడని విశ్వసించడం అవసరం. యేసు మృతులలోనుండి లేచాడని నివేదికలు, ఆధారాలు వచ్చిన తర్వాత, ఆయన సన్నిహిత అనుచరులు చాలా మంది నమ్మడానికి నిరాకరించారు. చివరకు ఆయన వారిలో చాలా మందికి ఒకేసారి కనిపించినప్పుడు, వారి కఠిన హృదయాలను మరియు విశ్వాసం లేకపోవడాన్ని బట్టి వారిని మందలించాడు (మార్కు 16:14). తన శిష్యులలో ఒకరితో ఇలా చెప్పాడు, “నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను” (యోహాను 20:29). మృతులలో నుండి యేసు పునరుద్ధానుడు అయ్యాడు అనేది మన విశ్వాసానికి ప్రాథమికమైనది. ఎందుకంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు మృతులలో నుండి మనలను లేపుతానని వాగ్దానం చేశాడు. 1 థెస్సలొనీకయులు 4:13-14 ఇలా చెబుతోంది, “సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.” ఈ భూమి యొక్క చివరి రోజున, యేసు తిరిగి వచ్చి, తనను నమ్మకంగా విశ్వసించిన వారిని మృతులలో నుండి లేపుతాడు (1 థెస్స. 4:16). ఈ విశ్వాసులందరూ దేవుని పరదైసులో ఆయనతో నిత్యము జీవించడానికి కొనసాగుతారు (ప్రకటన 2:7). యేసు పునరుత్థానాన్ని విశ్వసించడం అనేది క్రైస్తవులకు ఈ జీవితంలో మరియు నిత్యత్వం కోసం చూసే వారికి నిజమైన నిరీక్షణ మరియు ప్రోత్సాహంగా ఉంటుంది.


అయితే, యేసుపై నమ్మకం అనేది ఈ వాస్తవాలను అర్థం చేసుకోవడం మరియు అంగీకరించడం కంటే ఎక్కువ అని మనం గ్రహించాలి. యోహాను 8లో, యేసు తనను విశ్వసించిన వారితో మాట్లాడుతున్నాడు (8:31). అయినప్పటికీ, అదే విశ్వాసులను పాపానికి బానిసలుగా యేసు సూచించినప్పుడు, వారు త్వరగా తమ వైఖరిని మార్చుకున్నారు మరియు ఆయనతో వాదించడం ప్రారంభించారు (8:33ff). యేసు తనను తాను శరీర రూపము దాల్చిన దేవుడుగా ఉన్నానని చెప్పినప్పుడు, వారు ఆయనను చంపడానికి రాళ్లను ఎత్తారు (8:59). నిబద్ధత లేకుండా యేసుపై నిస్సారమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం సాధ్యమని ఈ విషయం మనకు చూపిస్తుంది. కొందరు వ్యక్తులు యేసు నుండి మంచి విషయాలను అంగీకరించాలని కోరుకుంటారు, కానీ వారు తమ జీవితాల కోసం ఆయన నిర్దేశాన్ని విధేయతతో అంగీకరించరు. పాపములో ఉండడానికి ఇష్టపడే అనుచరులను యేసు అంగీకరించడు. మన యజమానిగా ఆయనకు లోబడాలి. ఆయన కొరకు మన ప్రాణాలను అర్పించడానికి మనం సిద్ధంగా ఉండాలి (మార్కు 8:32-34). మనం ఇతరుల నుండి అపహాస్యం ఎదుర్కొన్నప్పుడు ఆయనపై విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకోవడానికి మరియు బహిరంగంగా ఆయన నామాన్ని స్తుతించడానికి కూడా సిద్ధంగా ఉండాలి (మత్తయి 10:28-33; యోహాను 12:42). దేవుడు మన నుండి కోరే విశ్వాసం, యేసు మరియు ఆయన బోధల పట్ల జీవితకాల విశ్వాసం ఉండాలి. దేవునితో సరిగ్గా ఉండడమంటే మన ఆలోచనలు మరియు కార్యాలన్నిటిని విస్తరించే లోతైన విశ్వాసాన్ని కలిగి ఉంటుంది మరియు అది బాహ్య వ్యక్తీకరణలో పొంగిపొర్లుతుంది. క్రైస్తవ విశ్వాసం క్రొత్త జీవనశైలి ద్వారా ప్రతిబింబిస్తుంది.


మీ మనస్సును మార్చుకొనుడి (పశ్చాత్తాపము)

దేవునితో సరిగ్గా ఉండడం అంటే మనం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటామని కాదు. కానీ మనము ప్రయత్నించబోతున్నామని దీని అర్థం. దేవుని అంచనాల ప్రకారం జీవించడానికి ఈ అంకితభావం లేకుండా, మనం నీతిమంతులుగా ఉండలేము. అపోస్తలుల కార్యములు 17:30-31 ఇలా చెబుతోంది, “ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు. “మారుమనస్సు” అనే పదానికి అర్థం “మీ మనసు మార్చుకోవడం.” ఇది మెటామార్ఫోసిస్ అనే పదం లాంటిది. గొంగళి పురుగు అందమైన సీతాకోకచిలుకగా మారడానికి కోకన్‌లో తన రూపాన్ని మార్చుకున్న విధానంలాగా ఒక క్రొత్త క్రైస్తవుడు తన పాత జీవితాన్ని సమాధిలో లోతుగా పాతిపెట్టి, తన మనస్సును మార్చుకుని, దేవునికి అంకితమైన క్రొత్త జీవితంతో నడవడానికి కట్టుబడి ఉంటాడు (రోమా 6:4; కొలొ 2:12). రూపాంతరం చెందిన మనస్సు ఇతరులు గమనించగలిగే మంచి కార్యాలు మరియు నిర్ణయాలకు కూడా దారి తీస్తుంది. మన పశ్చాత్తాపం ద్వారా, దేవుని సహాయంతో, మన జీవితాలు యేసును ప్రతిబింబించడం ప్రారంభిస్తాయి.


మీ ఆత్మను శుద్ధిచేసుకోండి (బాప్తిస్మము)

చివరగా, మన జీవితంలో యేసుకు మరియు ఆయన నైతిక బోధనలకు మనం ఎంత నమ్మకంగా ఉన్నా, మరియు ఆయన కోసం మన జీవితాలను ఎంత మార్చుకున్నా, దేవుడు మన ఆత్మలను శుద్ధి చేయకపోతే, మనం ఆయన ముందు ఇంకా దోషులమే అని మనం గ్రహించాలి. ఏదైనా ఒక పాపం మనల్ని దేవుని ఎదుట ఖండించదగినదిగా చేస్తుంది. కావున మన పాపములను తుడిచివేయవలెను. బాప్తిస్మము మరియు నీటిలో ముంచడం, మన పాపాలను కడిగివేయడానికి అవసరమైన భాగం. 1 పేతురు 3:21 ఇలా చెబుతోంది, “దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.” బైబిల్‌లో, ఒక వ్యక్తిని మరొక క్రైస్తవుడు నీటిలో ముంచినప్పుడు బాప్తిస్మము సంభవిస్తుంది. ఈ సమయంలోనే క్రొత్త విశ్వాసి యొక్క పాపాలను యేసు శాశ్వతంగా క్షమిస్తాడు మరియు ఇప్పుడు నీతిమంతుడుగా దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. అపొస్తలుల కార్యములు 2:38-39 చెబుతుంది, “పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.’” ఒకసారి మనం విశ్వసించి, పశ్చాత్తాపపడి, బహిరంగంగా ఒప్పుకొని బాప్తిస్మము తీసుకున్న తర్వాత, యేసు మరియు ఆయన బోధనలకు మనం కట్టుబడి ఉండాలి. మనం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు, కానీ మనం యేసులా ఉండేందుకు కృషి చేయాలి. మనం నమ్మకంగా ఉన్నంత కాలం, మనం దేవుని ముందు సరైన వాగ్దానాన్ని పొందగలము!

2 views
bottom of page