top of page

క్రైస్తవ బాప్తిస్మము అనగా ఏమిటి, మరియు అది ఎందుకు ప్రాముఖ్యమైనది?

బాప్తిస్మము వెనుక ఉన్న భావన ఏమనగా ఒకరి ఆత్మను పవిత్రపరచుటకు నీటితో కడగబడటం . ఈ అభ్యాసం మొదట అధికారికంగా క్రీస్తుచే స్థాపించబడింది (మత్తయి 28:18-20), అయితే ఇది పాత నిబంధన కాలం నుండి ముందే సూచించబడింది. దేవుడు పాపముతో సహవాసం చేయలేడు. అయినప్పటికీ, మానవజాతి అంతా మొదటినుండి ఏదో ఒక రూపంలో దేవునికి అవిధేయులయ్యారు. మానవజాతి పూర్తిగా చెడిపోయి, చెడ్డగా మారిన తొలి కాలాల్లో, దేవుడు తన ఆత్మ మనిషితో ఎప్పటికీ పోరాడదని చెప్పాడు (ఆది. 6:3) ఎందుకంటే ఆయన సరిదిద్దలేని మానవాళితో సహవాసం చేయలేడు లేదా జీవాన్ని ఇవ్వలేడు. కాబట్టి, ఆయన ప్రపంచముపైకి జలప్రళయాన్ని తెప్పించాడు , అది భూమిని దాని దుర్మార్గత నుండి శుభ్రపరిచింది, అదే నీటి ద్వారా ఎనిమిది మంది ఆత్మలు రక్షింపబడ్డాయి . ఈ ఎనిమిది మంది సృష్టికర్తతో వాగ్దాన సంబంధాన్ని పునరుద్ధరించుకున్నారు (ఆది. 9:9). నోవహు మరియు అతని కుటుంబాన్ని రక్షించిన గొప్ప ప్రవాహము క్రైస్తవ బాప్తిస్మము (1 పేతురు 3:20-21) ద్వారా వచ్చే రక్షణకు సూచన!


క్రైస్తవ బాప్తిస్మమును ముందుగా సూచించే పాత నిబంధన యొక్క మరొక ఉదాహరణ యెహెజ్కేలు 36లో ఉంది. దేవుని ప్రజలు ప్రభువు పట్ల అపనమ్మకత్వము చూపడం వలన ఓడిపోయి చెల్లాచెదురయ్యారు. వారు ఇంకా యెరూషలేము దేవాలయంలో దేవునితో సహవాసమును చెడగొట్టుకున్నారు . అయితే, దేవుడు తన ప్రజలతో వాగ్దానానికి సంబంధించిన కొత్త సంబంధాన్ని ఏర్పరచుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నాడని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మనం తెలుసుకుంటాము (యెహె. 37:26). ఈ ఒప్పందంలో భాగంగా, దేవుని ప్రజలు ఆయనతో సహవాసం చేయడానికి ఇంకా పవిత్రముగా ఉండాలి. దేవుడు ఎందుకు ఇలా చెప్పుచున్నాడు, “మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. నేను మీపితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులైయుందురు నేను మీ దేవుడనై యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును.” (యెహెజ్కేలు 36:25-29 ఉద్ఘాటన జోడించబడింది).


యెహెజ్కేలు సమయానికి మరియు యేసు కాలానికి మధ్య యూదులు విభిన్నమైన ఆచారపరమైన శుద్దీకరణలు స్థాపించుకున్నారు. వారు మిక్వాస్[1]. అని పిలువబడే నీటి కొలనులలో మునిగి దేవాలయములో బలులు అర్పించకముందు శుద్దీకరించబడతారు. వారు భోజనానికి ముందు తమను మరియు తమ పాత్రలను శుద్ధిచేసుకోవాలి (మార్కు 7:4; యోహాను 2:6). వారు అనేక సంప్రదాయాలు పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు కోరిన దాని కంటే ఎక్కువగా చేశారు, అయితే ఇది దేవునితో సరిగ్గా ఉండాలనే కేవలము నీటి ద్వారా మాత్రమే శుద్ధి చేసుకోవాలని యూదులకు పూర్వపు అవగాహన ఉందని ఇది రుజువు చేస్తుంది.


యేసు కొరకు మార్గము సిద్దపరచుటకు ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను అనే ప్రవక్త మారుమనస్సు నిమిత్తము నీటి బాప్తిస్మమును గూర్చి బోధించాడు. యెహెజ్కేలు ప్రవచించినట్లుగా (యోహాను 1:25-27) చివరికి తమను ఆత్మీయంగా శుద్ధి చేసి, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పునరుద్ధరించే క్రీస్తు నిమిత్తము వారు ఎదురు చూస్తున్నందున చాలామంది అతనిచే బాప్తిస్మం తీసుకోవడానికి బయలుదేరారు. యేసు కూడా యోహానుచే బాప్తిస్మము తీసుకుంటాడు. యేసు బాప్తిస్మము తీసుకున్న తర్వాత, దేవుని ఆత్మ ఆయనపైకి దిగివచ్చింది మరియు దేవుడు యేసును దేవుని కుమారునిగా ధృవీకరిస్తూ పరలోకం నుండి మాట్లాడాడు (యోహాను 1:33-34).


యేసు స్వయంగా తనను వెంబడించేవారు బాప్తిస్మము పొందవలసిన అవసరాన్ని తెలియపరచాడు (యోహాను 3:22; 4:1; మత్తయి 28:18-20). యోహాను 3:3-5లో, నీటి బాప్తిస్మము అనేది ఇకపై కేవలం యూదుల ఆచారం కాదని, “నీటిమూలముగాను మరియు ఆత్మ మూలముగాను జన్మించడం” అనేది “పై నుండి జన్మించటానికి” అవసరమైన అంశం అని యూదుల నాయకుడు నికోదేముకు యేసు స్పష్టం చేశాడు.[2] అపొస్తలులు క్రీస్తును బోధించడం ప్రారంభించినప్పుడు, వారి పాపక్షమాపణ కోసం మరియు దేవునితో సహవాసం కలిగి ఉండటానికి బాప్తిస్మము యొక్క అవసరాన్ని తెలియచేసారు .అపొస్తలుల కార్యములు 2:38, “లో పేతురు పెంతెకోస్తు దినమున అక్కడ కూడిన యూదుల సమూహముతో ఇలా చెప్పాడు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.” తరువాత, అపొస్తలుడైన పౌలు మారుమనస్సు పొందినప్పుడు, “తనకు అననీయ ఇలా చెప్పాడు, అపొస్తలుల కార్యములు 22:16 గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను” (అపొస్తలుల కార్యములు 22:16). పౌలు తీతుకు ఇలా వ్రాయుట కొనసాగించాడు, తీతుకు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.”


బాప్తిస్మము అనేది కేవలం ఆచారం లేదా సూచన కాదని క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా ఉంది. విశ్వాసి యొక్క ఆత్మలో యేసు యొక్క త్యాగము ప్రభావం చూపే విషయము ఇది. బాప్తిస్మము తీసుకోనిన , దేవుడు మన ఆత్మలను పరిశీలించి మరియు మన తప్పులను కనుగొనే బదులు, ఆయన తన కుమారుడైన యేసు యొక్క పరిపూర్ణ రక్త త్యాగాన్ని చూస్తాడు. బాప్తిస్మము లేకుండా, మనము యేసు రక్త త్యాగం ఆధారంగా వాగ్దానం యొక్క ఈ కొత్త సంబంధంలోకి ప్రవేశించలేము.[3] హెబ్రీయులకు 10:22 ఇలా చెప్పుచున్నది, “మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములుగలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములుగలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.” ఇది విశ్వాసి యొక్క భౌతిక బాప్తిస్మమును దేవుడు వారి ఆత్మను శుద్ధి చేయడంతో కలుపుతుంది.


రోమా ​​6:3-4లో పేర్కొంటూ క్రైస్తవ బాప్తిస్మముతో యేసు మరణానికి మరియు పునరుత్థాన జీవితానికి మధ్య మరింత సంబంధాన్ని బైబిల్ చూపిస్తుంది, “క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.” మరో మాటలో చెప్పాలంటే, ఒక క్రైస్తవుడు చివరి రోజున క్రీస్తు పునరుత్థానంలో పాల్గొనాలనుకుంటే, వారు ఆయన మరణంలో కూడా పాల్గొనవలసి ఉంటుంది, ఈ సందర్భంలో వారు నీటి బాప్తిస్మము ద్వారా ప్రాతినిధ్యం వహిస్తారు. కొలొస్సయులు 2:12 ఈ ఆలోచనకు సమాంతరంగా ఇలా చెబుతోంది, “... మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి.” క్రైస్తవుడిగా మారడానికి బాప్తిస్మము అనేది ఒక అవసరమైన మెట్టు అని దీని తాత్పర్యం. క్రీస్తు మరణం మరియు పునరుత్థాన శక్తి నుండి ప్రయోజనం పొందేందుకు ఇది ఒక అవసరం.


కొన్ని క్రైస్తవ సమూహాలు బాప్తిస్మము అనేది క్రైస్తవునిగా ఉండుటకు అవసరం లేదని బోధిస్తాయి, అది రక్షణకు అర్హమైన మన సొంత పనిమీద ఆధారపడుతుంది అని పేర్కొన్నారు. సువార్త అనేది మన సొంత యోగ్యత లేదా పనుల ఆధారంగా రక్షణ యొక్క ఆలోచనను నిశ్చయంగా తిరస్కరిస్తుంది (తీతుకు 3:5). అయితే, ఈ వాగ్దాన సంబంధం యొక్క షరతులకు సమర్పించుకొనుటకు క్రీస్తుకు విధేయత చూపడం అంటే మనం మన రక్షణకు అర్హులమని కాదు. 1 పేతురు 3:21 ప్రకారం, “దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.” మీరు యేసు బలియాగం యొక్క శుద్ధీకరణ శక్తి ద్వారా దేవునితో సహవాసంలో ఉండాలని చూస్తున్నట్లయితే, మీరు యేసు మరణం మరియు సమాధి ద్వారా దేవుని పనిలో పాల్గొనవలసి ఉంటుంది. మనము దీనిని బాప్తిస్మము ద్వారా చేస్తాము (రోమా 6:3–4; కొలస్సీ. 2:12). మీ పాపక్షమాపణ నిమిత్తము నీటి మూలముగా కడగబడాలి మేము మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాము. అది మీ కోరిక అయితే మాకు తెలియపర్చండి మరియు మీకు క్రీస్తులోకి బాప్తిస్మము ఇచ్చుటకు సిద్ధంగా ఉన్న స్థానిక క్రైస్తవునితో మిమ్మల్ని అనుబంధించుటకు మేము ప్రయత్నిస్తాము.

1. Everett Ferguson, Baptism in the Early Church: History, Theology, and Liturgy in the First Five Centuries (Grand Rapids: Eerdmans, 2009), 170. [2]. నికోదేముతో మారుమనస్సు గురించి మాట్లాడినప్పుడు బాప్తిస్మము స్పష్టంగా ప్రస్తావించబడలేదు. అయినప్పటికీ, ఈ సమయం వరకు యోహాను సువార్తలో బాప్తిస్మము మరియు శుద్ధీకరణ గురించి తరచుగా ప్రస్తావించబడినందున, ఇది గట్టిగా సూచించబడింది. [3]. ఈ ఆలోచన గొప్పప్రళయం యొక్క సంఘటనల క్రమంలో సమాంతరంగా ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు- మొదటిది, నోవహు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను (ఆది 6:22; 7:5, 9, 16). రెండవది, దేవుడు తుడిచివేయబడే విధముగా జలప్రళయమును పంపాడు (7:23, 24). మూడవది, నోవహు బలులు అర్పించాడు (8:20-21). చివరగా, ఈ మునుపటి కార్యకలాపాల ఆధారంగా, దేవుడు తన కొత్త వాగ్దాన సంబంధాన్ని స్థాపించాడు (9:9-17).

1 перегляд
bottom of page